Tuesday, November 19, 2024

Breaking | భద్రాచలం వద్ద మూడో ప్రమాద జారీ హెచ్చరిక

భద్రాచలం, (ప్రభ న్యూస్): భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 53 అడుగుల కంటే పెరిగింది. దీంతో మూడో ప్రమాద హెచ్చరికను జిల్లా యంత్రాంగం జారీ చేసింది. రాత్రి 9 గంటల ప్రాంతానికి భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 53.1 అడుగుగా నమోదయింది. పద్నాలుగు లక్షల 32 వేల వరద ఉధృతి దిగువకు వదులుతున్నారు.

వర్ధన్ పంపుతో భద్రాచలం పట్టణంలోని 430 పైగా కుటుంబాల నుంచి 1300 పైగా వ్యక్తులను పునరావాస కేంద్రాలకు తరలించారు. గోదావరి మరింత పెరిగి అరవై అడుగులకు చేరే అవకాశం ఉన్నందువల్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా ముంపు ప్రాంతంలో ఉన్నవారిని తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలిపోవాల్సిందిగా కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement