ప్రీతి కేసును వదిలిపెట్టే ప్రసక్తే లేదని, మీకు అండగా ఉంటూ న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాడుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు. జనగామ జిల్లాలోని గిర్నితండాలో ప్రీతి కుటుంబాన్ని బండి సంజయ్, మాజీ ఎంపీ రవీంద్ర నాయక్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు దశమంత్ రెడ్డి, ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు హుస్సేన్ నాయక్ తదితరులు పరామర్శించారు. ప్రీతిది హత్యేనని బండి సంజయ్ ఎదుట ప్రీతి కుటుంబ సభ్యులు వాపోయారు. మాకు న్యాయం జరగాలంటే సిట్టింగ్ జడ్జితోనే విచారణ జరిపించేలా చూడాలని ప్రీతి తండ్రి కోరారు. ప్రీతి మరణానికి కారకులకు కఠిన శిక్ష పడాలని, మా కుటుంబానికి మీరే న్యాయం జరిగేలా చూడాలని బండి సంజయ్ కు చేతులెత్తి నమస్కరించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ప్రీతి కేసును వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. మీకు అండగా ఉంటూ న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాడుతుందన్నారు. ఇప్పటికే ప్రీతి ఘటనపై ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేశామన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరగాలని మొదటి నుండి బీజేపీ డిమాండ్ చేస్తున్న విషయాని ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం అంశాన్ని డైవర్ట్ చేసేందుకు యత్నిస్తోందన్నారు. ప్రీతి మరణానికి కారకులైన వారందరికీ కఠిన శిక్ష పడే వరకు బీజేపీ పోరాడుతుందని ఉద్ఘాటించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement