Tuesday, November 19, 2024

Breaking : తాంసి ఉప సర్పంచ్ పదవికి రాజీనామా..

తాంసి : మండల కేంద్రానికి చెందిన గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ పదవికి మంగళవారం బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సామ సంతోష్ రెడ్డి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ ఆకుల భూమయ్యకు సమర్పించారు. ఈ సందర్భంగా సంతోష్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవ గ్రామ పంచాయతీ పాలక వర్గానికి రూ.10 లక్షల ప్రోత్సాహకం అందిస్తామని హామీ ఇచ్చి, ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ప్రోత్సాహకం అందించ లేదని అన్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి నప్పటికి ఎటువంటి స్పందన రాకపోవడంతో పంచాయతీ పాలక వర్గాన్ని గ్రామస్తులు నిలదీయడంతో నైతికంగా బాధ్యత వహిస్తూ గ్రామస్థుల కోరిక మేరకు ఇష్ట పూర్వకంగా ఉప సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. రాజీనామాను ఆమోదిస్తున్నట్లు ఎంపీడీఓ భూమయ్య తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement