Friday, November 22, 2024

Breaking : రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడిగా కాసర్ల అనంత రెడ్డి..

పెద్దపెల్లి జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షునిగా సుల్తానాబాద్ కు చెందిన కాసర్ల తిరుపతిరెడ్డి నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సుల్తానాబాద్ మండలం రైతు సమన్వయ సమితి అధ్యక్షుడుగా, ఆయన భార్య సుద్దాల సర్పంచ్ గా పని చేస్తున్నారు. గతంలో పెద్దపెల్లి జిల్లా రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షునిగా సీనియర్ నాయకులు దివంగత కోట రామ్ రెడ్డిని ప్రభుత్వము నియమించింది.. రెండు సంవత్సరాల క్రితం రైతుబంధు సమావేశానికి మంథని నియోజకవర్గం వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మరణించారు. అప్పటినుండి అధ్యక్షుడిని ఎవరినీ నియమించలేదు.

సీనియర్ నాయకులు, సుద్దాల గ్రామానికి రెండుసార్లు సర్పంచ్ గా వ్యవహరిస్తున్న ప్రస్తుత రైతు మండల అధ్యక్షునిగా ఉన్న కాసర్ల అనంత రెడ్డికి ఈ పదవి దక్కడం పట్ల సుల్తానాబాద్ మండల ప్రజలతో పాటు తెరాస శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపెల్లి శాసన సభ్యులు దాసరి మనోహర్ రెడ్డికి.. అనంతరెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ పదవి మరోమారు సుల్తానాబాద్ కు దక్కడం ఎంతో గర్వకారణమని సుల్తానాబాద్ మండలం ఎంపీపీ బాలాజీ రావు,జిల్లా రైతుబంధు డైరెక్టర్ పురం ప్రేమ్ చందర్ రావు,మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడు, సింగల్ విండో అధ్యక్షులు శ్రీగిరి శ్రీనివాస్, సందీప్ రావ్,సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ ముత్యం సునితా రమేష్ గౌడ్ తో పాటు మండల ప్రజా ప్రతినిధులు,నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement