Tuesday, July 2, 2024

Breaking | హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం… పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తెలంగాణలోని ప‌లు జిల్లాల్లో రాబోయే 3 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. కాగా, హైదరాబాద్‌లో ఇప్పటికే ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరంలో పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాం కురుస్తుంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, యూసుఫ్ గూడ, మాదాపూర్, కొండాపూర్, కూకట్ పల్లి పరిసర ప్రాంతాల్లో ఈదురు గాలులతో భారీ వర్షం కురుస్తోంది. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఒక్కసారిగా వర్షం రావడంతో రోడ్డుపై ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి.

రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని.. ఉత్తర ఒడిశా – పశ్చిమబెంగాల్ తీరాలకు ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సముద్ర మట్టానికి 7.6 కి.మీల ఎత్తులో నైరుతి దిశగా ఆవర్తనం ఉందని చెప్పారు. వీటి ప్రభావంతో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు, భారీ వర్షాలు కురుస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

అటు ఏపీలోనూ…

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే 3 రోజులు ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. నెల్లూరు, కావలి, ఒంగోలు, బాపట్ల, మచిలీపట్నం, భీమవరం, గన్నవరం, అన్నవరం, కాకినాడ, అమలాపురం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు, శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం, నెల్లూరు, నంద్యాల, అనకాపల్లి, సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని చోట్ల తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే, పార్వతీపురం మన్యం, అల్లూరి, అనకాపల్లి, కోనసీమ, తూ.గో, ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement