రామప్ప : ములుగు జిల్లాలోని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని బుధవారం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. అంతకు ముందు రాష్ట్రపతికి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రామప్పలో రుద్రేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం భద్రకాళి ప్రధాన పూజారి శేషు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ములుగు జిల్లా రామప్ప పర్యటనలో భాగంగా హెలిప్యాడ్ కి చేరుకున్న రాష్ట్రపతికి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే సీతక్క, ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఐటిడిఏ పీఓ అంకిత్, ములుగు ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్రపతి వెంట తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీమతి తమిళి సై సౌందర్య రాజన్, కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్, తదితరులు ఉన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement