బెంగాల్ లో ది కేరళ స్టోరీ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. బెంగాల్ ప్రభుత్వం ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ది కేరళ స్టోరీ సినిమాని నిషేధించవద్దని ఆదేశాలు జారీ చేసింది. కేరళ స్టోరీ సినిమాను బెంగాల్ ప్రభుత్వం బ్యాన్ చేయడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. బ్యాన్ చేయాల్సిన అవసరమేముందని ప్రశ్నించింది. ప్రభుత్వానికి నోటీసులు కూడా ఇచ్చింది. బెంగాల్‌లో సినిమాను బ్యాన్ చేయడాన్ని సవాలు చేస్తూ నిర్మాతలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం…ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. దేశవ్యాప్తంగా సినిమా ఆడుతున్నప్పుడు బెంగాల్‌లో మాత్రం ఎందుకు నిషేధించారని ప్రశ్నించింది. తమిళనాడు ప్రభుత్వం నిషేధించకపోయినప్పటికీ…కొన్ని థియేటర్ల ఓనర్లు కావాలనే సినిమాలు ప్రదర్శించకుండా నిలిపివేశారు. శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిపైనా విచారణ జరిపిన సుప్రీంకోర్టు తమిళనాడు ప్రభుత్వానికీ నోటీసులు అందించింది. ఈ విచారణలో నిర్మాతలూ తమ వాదనలు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి ఆదాశర్మ ప్రధాన పాత్రని పోషించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement