గాజాలోని పాలస్తీనా యూనివర్సిటీకి చెందిన ఓ క్యాంపస్ బిల్డింగ్‌ను ఇజ్రాయిల్ దళాలు పేల్చివేశాయి. ఆ ఘటనకు చెందిన వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోపై అమెరికా అనుమానాలు వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో షేర్ అవుతున్న ఆ పేలుడు వీడియోపై అమెరికా క్లారిటీ కోరింది. నిర్మానుషంగా ఉన్న యూనివర్సిటీ బిల్డింగ్ అకస్మాత్తుగా పేలుతుంది. ఆ బిల్డింగ్‌లో దాచిపెట్టిన పేలుడు పదార్ధాల వల్ల అది పేలినట్లు తెలుస్తోంది. పేలిన తర్వాత అన్ని దిక్కులా శిథిలాలు ఎగిరిపడ్డాయి. భారీ స్థాయిలో పొగ కూడా వచ్చింది. అయితే.. ఈ వీడియోపై కామెంట్ చేసేందుకు అమెరికా రక్షణ శాఖ ప్రతినిధి డేవిడ్ మిల్లర్ నిరాకరించారు. తమ వద్ద సరైన సమాచారం లేదన్నారు. గత ఏడాది అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయిల్‌పై హమాస్ అటాక్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇజ్రాయిల్, హమాస్ మధ్య వార్ నడుస్తోంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement