కజకిస్తాన్ లో నేడు ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది.. బుధవారం నాడు అయిదుగురు సిబ్బందితో సహా 67 మంది ప్రయాణీకులతో ప్రయాణిస్తున్న విమానం కజకిస్తాన్‌లోని అక్టౌ నగరానికి సమీపంలో కూలిపోయింది.. కజకిస్తాన్ అత్యవసర మంత్రిత్వ శాఖను ఉటంకిస్తూ రష్యా వార్తా సంస్థలు ప్రమాదఘటనను తెలిపాయి . అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్ విమానం రష్యాలోని చెచ్న్యాలోని బాకు నుండి గ్రోజ్నీకి వెళుతుండగా, గ్రోజ్నీలో పొగమంచు కారణంగా దారి మళ్లించినట్లు వార్తా సంస్థలు తెలిపాయి. ఈ సమయంలోనే ఒక పక్షి విమానాన్ని ఢి కొంది.. వెంటనే పైలెట్ అత్యవసర ల్యాండింగ్ కు అనుమతి కోరి విమానాన్ని దించుతుండగా కుప్పకూలింది. ఈ విమానంలో 67 మంది ప్రయాణిస్తుండగా ఇందులో ఇప్పటికీ 25రు మాత్రమే సురక్షింతంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మిగిలిన 25 మంది మరణించారు. రెస్య్యూ దళాలు ప్రమాద సంఘటన స్థలానికి చేరుకున్నాయి. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement