Friday, November 22, 2024

Breaking News – మ‌ద్యం స్కాం కేసులో కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసిన సిబిఐ…

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని ఈ కేసులో సీబీఐ అరెస్ట్ చేసింది. మ‌ద్యం కేసులో అరెస్టు చేసేందుకు కేంద్ర దర్యాప్తు బృందానికి కోర్టు బుధవారం అనుమతించింది. న్యాయమూర్తి అమితాబ్‌ రావత్‌ ఆదేశాలు జారీ చేసిన వెంటనే సీబీఐ అధికారులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. తిహార్ కేంద్ర కారాగారం నుంచి కేజ్రీవాల్‌ను ఉదయం కోర్టు ముందు హాజరుపర్చారు. ఆయనను కస్టడీకి కోరుతూ సీబీఐ కోర్టుకు దరఖాస్తు చేసుకుంది. దీనిపై నిర్ణ‌యం వెలువ‌డాల్సి ఉంది..

ఇది ఇలా ఉంటే లిక్కర్ పాలసీ కేసులో కీలక సూత్రధారిగా పేర్కొంటూ మార్చి 21న ఈడీ కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి తీహార్ జైలులో ఉన్నారు. అయితే, లోక్‌సభ ఎన్నికల ప్రచార నిమిత్తం ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 2న లొంగిపోవాలని ఆదేశించింది. ఇదిలా ఉంటే ఇటీవల లిక్కర్ కేసును విచారిస్తున్న రౌస్ ఎవెన్యూ కోర్టు కేజ్రీవాల్‌కి బెయిల్ మంజూరు చేసింది. దీనిపై ఈడీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు స్టే విధించింది. ఈ స్టేపై ఈ రోజు కేజ్రీవాల్ తరుపు న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. ఈలోపే సీబీఐ అతడిని అరెస్ట్ చేసింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement