యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరులో ఉన్న ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్ లో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఎనిమిది మంది కార్మికులు గాయపడ్డారు.. వారికి వెంటనే చికిత్స కోసం హాస్పటల్ కు తరలించారు. భారీ శబ్దంతో రియాక్టర్ పేలడంతో భయంతో కార్మికులు బయటకు పరుగులు తీశారు. రియాక్టర్ పేలిన వెంటనే అలెర్ట్ అయిన కంపెనీ యాజమాన్యం ఎమర్జెన్సీ సైరన్‌ను మోగించింది. ప్రమాదవశాత్తు పేలుడు పదార్ధాలు బ్లాస్ట్ అవడంతో భవనం కూలిపోయింది.
ఈ ఘటనలో ఒక కార్మికుడు మృతి చెందగా… ఏడుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే క్షతగాత్రులను 108లో ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తీసుకుచ్చారు. కు తీవ్ర గాయాలయ్యాయి.