స్టార్ హీరోయిన్ నయనతార..విఘ్నేశ్ దంపతుల సరోగసి చట్టబద్దమేనని తేలింది. ఈ మేరకు సరోగసికి గల కారణాలను రిపోర్ట్ లో తెలపలేదు కమిటీ..చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో సరోగసి జరిగిందని వెల్లడించింది.సరోగసి చట్టబద్ధంగానే జరిగిందని కమిటీ నివేదిక ఇచ్చింది. 2021ఆగస్టులో సరోగసి ప్రక్రియ మొదలైంది..కాగా వారి పెళ్లి 2016మార్చి 11న జరిగినట్టు అఫిడవిట్ లో సమర్పించారు. ఆసుపత్రి సిబ్బంది..వైద్యులను విచారించమని కమిటీ సభ్యులు తెలిపారు..కాగా అద్దె గర్భం దాల్చిన మహిళకి వివాహమయిందని చెప్పారు. సరోగసీ ప్రక్రియలో నిబంధనలు ఫాలో అయ్యారని రిపోర్ట్ లో తేలింది. దాంతో సరోగసీ వివాదంలో నయనతార కు క్లీన్ చిట్ వచ్చింది. దాంతో నయనతార..విఘ్నేశ్ ల సరోగసి వివాదానికి ముగింపు పలికారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement