తిరుపతి రూరల్ : చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రాయల చెరువు కట్టపైనే ఉంటూ లీకేజీ పనులు పూర్తయ్యే వరకు ప్రభుత్వ విప్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిద్రాహారాలు, స్నానం అన్నీ వారం రోజుల పాటు అక్కడే ఉండి కట్ట మరమ్మత్తు పనులు పూర్తి చేయించారు. వారం రోజుల తరువాత తుమ్మలగుంటలోని నివాసానికి చేరుకున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కుటుంబ సభ్యులు హారతి పట్టి స్వాగతం పలికారు. అల్పపీడనం ఉదృతి వరద రూపంలో చంద్రగిరి నియోజకవర్గ ప్రజలను భయాందోళనలకు గురిచేసిన నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బాసటగా నిలిచారు. వారం రోజుల పాటు ఇంటికి వెళ్లకుండా వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించడంతో పాటు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. రాయల చెరువు కట్ట లీకేజీతో హడలిపోయిన ప్రజలను గ్రామాల నుంచి ఖాళీ చేయించి పునరావాస కేంద్రాల్లో వసతి ఏర్పాటు చేశారు. ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేసిన ఎమ్మెల్యే చెవిరెడ్డి సేవాతత్వం పట్ల శభాష్ చెవిరెడ్డి అంటూ సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..