Friday, November 22, 2024

Breaking : ఫుట్ వేర్ త‌యారీ ఫ్యాక్ట‌రీలో భారీ అగ్నిప్ర‌మాదం-మంట‌లార్పుతున్న ఏడు ఫైర్ ఇంజిన్స్

ఫుట్ వేర్ త‌యారీ ఫ్యాక్ట‌రీలో భారీ అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదం స‌మాచారం అందిన వెంట‌నే అధికారులు అప్రమత్తమై ఘటనా ప్రాంతానికి అగ్నిమాపక యంత్రాలను తరలించారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ఘటనా ప్రాంతంలో ఏడు అగ్నిమాపక యంత్రాలతో పాటు సిబ్బంది శ్రమిస్తున్నారని అధికారులు తెలిపారు. పరిసర ప్రాంతంలోని కంపెనీలకు మంటలు విస్తరించకుండా చర్యలు చేపడుతున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రాధమిక దర్యాప్తు అనంతరం అగ్నిప్రమాదానికి కారణం వంటి మరిన్ని వివరాలు వెల్లడవుతాయని చెబుతున్నారు. ఢిల్లీలోని నరేలా పారిశ్రామిక ప్రాంతంలో మూడంతస్తుల భవనంలో ఈ ఫుట్‌వేర్‌ తయారీ ఫ్యాక్టరీ ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement