ఐఎస్ బీ 20వ వార్షికోత్సవానికి హాజరయ్యారు ప్రధాని నరేంద్ర మోడీ. గ్రాడ్యుయేషన్ గౌన్ లో హాజరయ్యారు ప్రధాని మోడీ. కాగా 930మంది పట్టాలు పొందనున్నారు.10మందికి గోల్డ్ మెడల్స్..పట్టాలను అందజేయనున్నారు మోడీ. ఐఎస్ బి ప్రత్యేక పోస్టల్ కవర్ ని ప్రధాని ఆవిష్కరించారు. కాగా అకడమిక్ సెంటర్ లో మొక్కని నాటారు ప్రధాని. మోడీతో పాటు గవర్నర్ తమిళిసై,కిషన్ రెడ్డి,తలసాని తదితరులు పాల్గొన్నారు. ఐఎస్ బీ గురించి మోడీకి వివరించారు డీన్ మదన్. అనంతరం మోడీ ప్రసంగించారు. ఐఎస్ బి ఈ స్థాయికి రావడం వెనుక చాలా మంది కృషి ఉందన్నారు.2001లో ఆనాటి ప్రధాని వాజ్ పేయ్ దీన్ని ప్రారంభించారన్నారు. నేడు ఆసియాలోనే ఐఎస్ బి టాప్ బిజినెస్ స్కూల్ అని చెప్పారు. ఐఎస్ బి లో చదివిన వారు విదేశాల్లో ఉన్నత హోదాలో ఉన్నారన్నారు. అనేక స్టార్టప్ లను ప్రారంభించారు..దేశానికే గర్వకారణం ఐఎస్ బి అన్నారు మోడీ. వచ్చే 25ఏళ్లకు రోడ్ మ్యాప్ ను సిద్ధం చేస్తున్నాం..ఆ ప్రణాళికల్లో మీకు చాలా కీలక పాత్ర ఉంటుందన్నారు.జి20 దేశాల్లో భారత్ అతి వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఇంటర్నెట్ వాడకంలో భారత్ రెండో స్థానంలో ఉందన్నారు. ప్రపంచంలో 3వ అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థ భారత్ లో ఉందని మోడీ అన్నారు. కరోనా సమయంలో భారత్ తన శక్తి ..సామర్థ్యాలను ప్రపంచానికి చూపించిందన్నారు. ఐఎస్ బి తన ప్రయాణంలో కీలక మైలురాయిని చేరిందన్నారు. ఐఎస్ బి ఈ స్థాయికి రావడం వెనుక చాలా మంది కృషి ఉందన్నారు.
Breaking : దేశానికే గర్వకారణం ఐఎస్ బి -ఆసియాలోనే ఐఎస్ బి టాప్ బిజినెస్ స్కూల్-ప్రధాని మోడీ
Advertisement
తాజా వార్తలు
Advertisement