హైదరాబాద్ : పెట్రోల్ ధరలు భారీగా పెరిగాయి. సామాన్యుడు వాహనం బయటకు తీయాలంటేనే భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనికి తోడు పెట్రోల్ బంక్ యజమానుల అత్యాసతో వాహనదారులు కొట్టించుకునే పెట్రోల్‌ను కూడా నొక్కేసి సొమ్ముచేసుకుంటున్నారు. పెట్రోల్ బంకుల్లో చిప్‌లతో మోసాలకు పాల్పడుతున్నారు. పలు పెట్రోల్ బంకుల్లో ఎస్‌వోటీ పోలీసులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. శివరాంపల్లిలోని ఇండియన్ ఆయిల్ బంకులో చిప్ అమర్చి నిర్వాహకులు మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. లీటర్‌కు రూ.10 గండికొడుతున్నారు. ఇలా రోజుకు వేల లీటర్లు అమ్మి భారీగా ఆధాయం ఘడిస్తున్నారు. పేదల వాహనదారుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. ఈ మేరకు ఆ పెట్రోల్ బంక్ యజమానిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. చిప్‌లు అమర్చిన నిందితుడిని ఎస్‌ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ వ్యాప్తంగా పలు పెట్రోల్ బంకుల్లో చిప్‌లు అమర్చినట్లు నిందితుడు అంగీకరించాడు. దీంతో మరిన్ని పెట్రోల్ బంకుల్లో దాడులు జరిపేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
BREAKING : పెట్రోల్ బంకుల్లో చిప్‌లతో మోసాలు.. బంక్ యజమానిపై కేసు నమోదు..
Advertisement
తాజా వార్తలు
Advertisement