ఉత్తరాఖండ్ జిల్లా జైలులో కరోనా కలకలం చెలరేగింది.. జైలులోని 70 మంది ఖైదీలకి కరోనా పాజిటీవ్ గా తేలింది. ఈ సంఖ్య మరింత పెరగవచ్చని అంచనా. కొంతమంది ఖైదీల రిపోర్ట్స్ ఇంకా రాలేదని, అటువంటి పరిస్థితిలో, సోకిన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. హెపటైటిస్ .. ఇతర పరీక్షల కోసం జైలులో వైద్య శిబిరం ఏర్పాటు చేయబడింది. ఈ పరీక్షల్లో కరోనా నమూనాలను కూడా తీసుకున్నారు. జిల్లా జైలులో 70 మంది ఖైదీల రిపోర్టు పాజిటివ్‌గా వచ్చిందని కరోనా శాంప్లింగ్ ఇన్‌ఛార్జ్ డాక్టర్ రాజేష్ గుప్తా తెలిపారు. దాదాపు 937 మంది ఖైదీల ఆర్టీపీసీఆర్ నమూనాలను తీసుకున్నారు. ఇందులో దాదాపు 500 మంది ఖైదీల రిపోర్టు రాగా, 70 మంది ఖైదీల రిపోర్టు పాజిటీవ్ అని తేలింది. మిగిలిన 300 నివేదికలు ఇంకా రావాల్సి ఉంది.
శాంపిల్స్ తీసుకున్న ఖైదీలకు ఎలాంటి లక్షణాలు లేవు. అనుమతి లేకుండా శాంపిల్స్ తీసుకున్నారని.. ముందుగా జైలు అడ్మినిస్ట్రేషన్ కి సమాచారం ఇవ్వాలని జైలు సూపరింటెండెంట్ మనోజ్ ఆర్య తెలిపారు. ఖైదీల ఐసోలేషన్ పీరియడ్ పూర్తయిందని చెప్పారు.
Breaking : హరిద్వార్ జైల్లో కరోనా కలకలం- 70 మంది ఖైదీలకు పాజిటీవ్
Advertisement
తాజా వార్తలు
Advertisement