విజయవాడ : రాజ్యాంగం చాలా గొప్పదని, మనకు క్రమశిక్షణ నేర్పే మంచి పుస్తకం అని ఏపీ సీఎం జగన్ అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఏపీ సీఎం జగన్, ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ… నిరుపేదలకు, అనగారిన వర్గాలకు అధికార దుర్వినియోగం జరిగినప్పుడు వారి రక్షణకు ఈ రాజ్యాంగం ఎంతో దోహపడింది. దేశంలో అన్ని రకాల వర్గాల వారు స్వేచ్ఛగా జీవించేలా రాజ్యాంగంలో చట్టాలను పొందుపర్చడం జరిగిందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం నిర్మించిన అబేద్కర్ గొప్ప వ్యక్తి అన్నారు. ఏపీలో రాజ్యంగంలో చెప్పిన విధంగా గ్రామ స్వరాజ్యం అమలు చేయడం జరిగిందన్నారు. పాఠశాల్లో అన్ని వర్గాల వారికి సమానత్వం కల్పించడం జరిగిందన్నారు. ఇంగ్లిష్ మీడియంతో చదువులు చెప్పడం జరుగుతుందన్నారు. ప్రత్యక రిజర్వేషన్లను సైతం అమలు చేయడం జరుగుతుందన్నారు. అన్ని వర్గాలను బలోపేతం దిశగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement