పెద్దపల్లి డిసిపి గా డాక్టర్ చేతన మైలబతుల ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. 2013 బ్యాచ్ కు చెందిన ఐపిఎస్ అధికారిని చేతన మహబూబ్ నగర్ లో శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం సుల్తాన్ బజార్ ఏసిపి గా పనిచేశారు.
అనంతరం నారాయణపేట ఎస్పీగా, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లో ఎస్పీగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం అవినీతి నిరోధక శాఖలో జాయింట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ఐపీఎస్ అధికారిని చేతన భర్త ఐఏఎస్ అధికారి శివకుమార్. ప్రస్తుతం ఆయన జిహెచ్ఎంసిలో అడిషనల్ కమిషనర్ గా పనిచేస్తున్నారు. పెద్దపల్లి డిసిపిగా నియమితులైన డాక్టర్ చేతన శనివారం బాధ్యతలు స్వీకరించనున్నారు.