మునుగోడు ప్రజల నమ్మకాన్ని రాజగోపాల్ రెడ్డి అమ్ముకున్నారని మంత్రి జగదీశ్వర్ రెడ్డి మండిపడ్డారు.ఆరు నెలల కిందట రూ.18వేల కోట్ల కాంట్రాక్టు వచ్చిందన్నారు.మూడు సీట్లు ఉన్న పార్టీలోకి వెళ్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందా అని నిలదీశారు. రాజగోపాల్ రెడ్డి స్వార్థం వల్లే ఉప ఎన్నిక జరుగుతుందని మంత్రి జగదీశ్వర్ రెడ్డి తెలిపారు.రూ.22వేల కోట్లకు రాజగోపాల్ రెడ్డి అమ్ముడుపోయారని ఆరోపించారు. అమ్ముడుపోయినట్లు ఆయన ఒప్పుకున్నారన్నారు.ఓటు అడిగే నైతిక హక్కు రాజగోపాల్ కి లేదన్నారు.రాజగోపాల్ రెడ్డి బరితెగించి మాట్లాడుతున్నారని మంత్రి దుయ్యబట్టారు. కాంట్రాక్టు వచ్చిన తర్వాతే బిజెపిలో చేరానని ఒప్పుకున్నారన్నారు.రాజగోపాల్ మాట్లాడే ప్రతి మాట అబద్ధమేనని చెప్పారు.
Breaking : రాజగోపాల్ రెడ్డి స్వార్థం వల్లే మునుగోడులో ఉప ఎన్నిక-మంత్రి జగదీశ్వర్ రెడ్డి
Advertisement
తాజా వార్తలు
Advertisement