అప్పుడే పుట్టిన బిడ్డకు కరోనా సోకింది..దాంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో 19 రోజులు వైద్య సేవలు అందించారు. తల్లి బిడ్డను ప్రభుత్వ వైద్యులు రక్షించిన సంఘటన కాకినాడ చోటుచేసుకుంది. ఈ సందర్భంగా జీజీహెచ్ లో ఏర్పాటుచేసిన చేసిన విలేకర్ల సమావేశంలో సూపర్ డెంట్ డాక్టర్ బుద్ధ మాడ్లాడారు. అంతర్వేదికి చెందిన తోట రత్నన్ రాజుతో.. రాజమణికి రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. రాజమణికి నెలలు నిండటంతో ఈనెల నాలుగో తేదీన కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. రాజమణి మగబిడ్డకు జన్మనిచ్చింది. రాజమణి, బిడ్డకు కరోనా పరీక్షలు నిర్వహించగా కోవిడ్ నిర్ధారణ అయింది. దీంతో నవజాత శిశు ఐసీయూ ఈ విభాగంలో తల్లి బిడ్డ కు 19 రోజులపాటు ప్రత్యేక వైద్య సేవలు అందించారు. తల్లి బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి వెళ్ళారు.
గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..