ఈ ఏడాది బోనాలకు రూ.17కోట్లని విడుదల చేసింది సీఎం కేసీఆర్ సర్కార్. ఈ మేరకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. కాగా నేడు గోల్కొండ జగదాంబ అమ్మవారి బోనాలు ప్రారంభం కానుందని ప్రకటించారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ పూజలో భాగంగా అమ్మవారికి మొదటి నజర్ బోనం సమర్పించనున్నారు. నేడు లంగర్హౌస్ చౌరస్తా నుంచి భారీ ఊరేగింపుతో గోల్కొండ కోటకు నజర్ బోనం అలాగే తోటలను తీసుకువెళ్తారు. మధ్యాహ్నం ఒకటి గంటలకు ప్రారంభమయ్యే ఊరేగింపు రాత్రి 8 గంటల వరకు కోటపై ఉన్న అమ్మవారి ఆలయానికి చేరుకొనుంది.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం తరఫున మధ్యాహ్నం 12 గంటలకు లంగర్ హౌస్ చౌరస్తాలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అలాగే ఇంద్రకరణ్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. జులై 5 న అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం నిర్వహిస్తామని చెప్పారు. ఈ సారి అమ్మవారి కల్యాణానికి 5 లక్షల మంది వరకు వస్తారని అంచనా వేస్తున్నామని.. అమ్మవారి కల్యాణానికి వచ్చే లక్షలాది మంది భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
Breaking : ఈ ఏడాది బోనాలకు రూ.17కోట్లు – కేసీఆర్ సర్కార్ నిర్ణయం
Advertisement
తాజా వార్తలు
Advertisement