గో ఫస్ట్ విమానాన్ని ఓ పక్షి ఢీకొట్టింది. దాంతో ఆ విమానాన్ని గుజరాత్ లోని అహ్మదాబాద్ కి మళ్లించారు. అహ్మదాబాద్ నుంచి చండీగఢ్ వెళ్తుతోంది ఈ విమానం. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ప్రకారం.. అహ్మదాబాద్ నుంచి చండీగఢ్ వెళ్తున్న గో ఫస్ట్ ఫ్లైట్ G8911 విమానానికి పక్షి ఢీకొనడంతో అహ్మదాబాద్‌కు మళ్లించామని DGCA తెలిపారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం తెలియరాలేదు. ఇటీవల దేశీయ విమానయాన సంస్థలకు చెందిన విమానాలు తరుచు ప్రమాదాలకు గురవుతున్నాయి. లోపాలను సరిచేయడానికి క్యారియర్లకు సరిపడా సర్టిఫైడ్ సిబ్బంది లేరని, కొన్ని పరికరాలు లోపభూయిష్టంగా ఉన్నప్పటికీ విమానాలు నడపడానికి అనుమతించే నిబంధనను అమలు చేస్తున్నాయని DGCA తెలిపింది. అయినప్పటికీ దేశీయ విమానయానం యోగ్యతకు ముప్పు లేదనీ, విమానయాన సంస్థలు కూడా సమస్యలకు కారణాన్ని సరిగ్గా గుర్తించడం లేదని తెలిపింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement