కుప్పం : 40 ఏళ్లు పోరాడిన పార్టీ తెదేపా అని, ఎన్నో ఇబ్బందులను సమర్థంగా ఎదుర్కొన్నాం అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రాన్ని అంధకారం చేయకూడదని పోరాడుతున్నాం అని, తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని అడ్డుకోవాలని చూస్తున్నారు అని ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎవరు కనపబడితే వాళ్లపై కేసు పెట్టి జైల్లో పెడతారా..?, నేను సీఎంగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, షర్మిల, జగన్ పాదయాత్రలు చేశారు కదా మేం అడ్డుకున్నామా ప్రశ్నించారు. ఆ పాదయాత్రలకు పోలీసు భద్రత కల్పించా.. ఇప్పుడు వీళ్లు మాత్రం నా నియోజకవర్గంలో నేను తిరుగుతుంటే అడ్డుపడుతున్నారు ఇదేం కర్మ జగన్ అన్నారు. దాడి చేసి తిరిగి మాపైనే కేసులు పెడుతున్నారు.. పోలీసు వ్యవస్థలో కొందరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. రాష్ట్రాన్ని కాపాడే ఈ పోరాటంలో పోలీసుల సహకారం అవసరం అన్నారు. చట్టాలను అతిక్రమించిన పోలీసులూ నేరస్థులే అని, జిల్లా ఎస్పీ లా అండ్ ఆర్డర్‌ను కాపాడేందుకు వచ్చారా?, తెదేపా కార్యకర్తలపై దాడులకు వచ్చారా? అని ప్రశ్నించారు. రోడ్డు షోలు రాష్ట్రానికి కొత్తా?, గత 70 ఏళ్ల నుంచి జరగలేదా?, జగన్ పాదయాత్రలో రోడ్డుషోలు జరగలేదా…? అని ప్రభుత్వంపై మండిపడ్డారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement