జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ముగిసింది. ఈ సమావేశం నుండి బయటికి వచ్చిన ఉద్యోగ సంఘాలు మీడియాతో మాట్లాడాయి. పీఆర్సీ నివేదికని బయటపెట్టలేదని సమావేశాన్ని బాయ్ కాట్ చేశారు ఉద్యోగ సంఘాల వారు. పీఆర్సీ నివేదిక ఇవ్వకుండా మోసం చేశారని ఏపీ జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు అన్నారు. లక్షలాది మంది ఉద్యోగులకు ఏం చెప్పాలని వాపోయారు. 13లక్షల మంది ఉద్యోగులు,ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు పీఆర్సీ కోసం ఎదురుచూస్తున్నారన్నారు. ఒకటో తేదీన జీతాలు ఇచ్చే పరిస్థితి ప్రభుత్వానికి ఉందని ఆయన అన్నారు. నివేదిక కాలయాపన కోసమే కమిటీ వేశారని మండిపడ్డారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement