పీఆర్సీ, ఇతర అంశాలపై వివరణ ఇచ్చారు ఏపీసీఎస్ సమీర్ శర్మ. ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. గతానికి,ఇప్పటికీ చాలా తేడా ఉందన్నారు. కరోనా లేకపోతే 98వేల కోట్ల ఆదాయం వచ్చేదని సమీర్ శర్మ తెలిపారు. రాష్ట్ర సొంత ఆదాయం పడిపోయిందన్నారు. ఆదాయాన్ని, ఖర్చుల్ని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యోగుల జీతాల బడ్జెట్ ఏపీలోనే ఎక్కువగా ఉందన్నారు. థర్డ్ వేవ్ తో మరింత నష్టం వచ్చేలా కనిపిస్తోందని సీఎస్ సమీర్ శర్మ అన్నారు. అన్నిటిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..