ప్రధాని మోదీ తన కొత్త కేబినెట్‌లోని మంత్రులకు శాఖలను కేటాయించారు. ఢిల్లీలోని మోదీ నివాసంలో జరిగిన ప్రధాని 3.0 కేబినెట్ భేటీలో ఈ శాఖల కేటాయింపు వివరాలను మంత్రులకు తెలియజేశారు. . బీజేపీ తెలంగాణ ఎంపీ కిషన్ రెడ్డికి బొగ్గు, గనుల శాఖ మంత్రిగా పదవి దక్కింది. బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా, పెమ్మసాని చంద్రశేఖర్ గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు. భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రిగా శ్రీనివాసవర్మ వ్యవహరించనున్నారు. మంత్రులకు శాఖల కేటాయింపుపై మరికాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడనుంది.
కేంద్ర మంత్రులు వారి శాఖలు..
- రాజ్ నాథ్ సింగ్ – రక్షణ శాఖ
- అమిత్ షా – హోం శాఖ
- నిర్మలా సీతారామన్ – ఆర్థిక శాఖ
- మనోహర్ లాల్ ఖట్టర్ – పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ
- పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రులు – శ్రీపాద నాయక్, సాహు
- నితిన్ గడ్కరీ – ఉపరితల రవాణా శాఖ
- రవాణా సహాయ మంత్రులు – అజయ్, హర్ష్ మల్హోత్రా
- జైశంకర్ – విదేశాంగ శాఖ
- అశ్వనీ వైష్ణవ్ – సమాచార, ప్రసార శాఖ
- చిరాక్ పాసవాన్ – క్రీడాశాఖ
- శివరాజ్ సింగ్ చౌహాన్ – పంచాయతీ రాజ్, గ్రామీణం, వ్యవసాయం
- జితన్ రామ్ మాంఝీ – ఎంఎస్ఎంఈ, సహాయ మంత్రి – శోభ
- కింజరాపు రామ్మోహన్ నాయుడు – పౌర విమానయాన శాఖ
- కిరణ్ రిజుజు – పార్లమెంటరీ వ్యవహారాలు
- మన్సుఖ్ మాండవియా – కార్మిక మంత్రిత్వ శాఖ
- ధర్మేంద్ర ప్రధాన్ – విద్యాశాఖ
- పీయుష్ గోయల్ – వాణిజ్యం
- హర్దీప్ సింగ్ పూరీ – పెట్రోలియం శాఖ
- సీఆర్ పాటిల్ – జలశక్తి శాఖ
- జేపీ నడ్డా – ఆరోగ్యశాఖ
- కిషన్ రెడ్డి.. బొగ్గు, గనుల శాఖ
- బండి సంజయ్.. హోం శాఖ సహాయ మంత్రి