మునుగోడు నియోజకవర్గం మద్యం అమ్మకాల్లో రికార్డులు బద్దలు కొట్టింది. అక్టోబర్ నెలలో రూ.300 కోట్ల మద్యం అమ్మకాలు సాగించి ఆల్‌టైం రికార్డును నమోదు చేసింది. మునుగోడు ఉప ఎన్నిక దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. వివిధ పార్టీల నాయకులు ఓటర్లను భారీగానే ప్రలోబాలను గురిచేసినట్లు వార్తలు వచ్చాయి. అన్ని పార్టీల నేతలంతా మునుగోడులోనే తిష్టవేసి అక్కడి కార్యకర్తలు, ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. బిర్యానీలు, మందు, డబ్బులు ఎందులోనూ తగ్గేదేలే అన్నట్లు నాయకులు వ్యవహరించిన తీరు తెలిసిందే.. ఇదిలా ఉంటే కొంతమంది మునుగోడు ప్రజలు బహిరంగంగానే మాకు మద్యం, డబ్బులు, బిర్యానీలు నాయకుల నుంచి అందినట్లు తెలిపారు. అయితే ఉప ఎన్నికల వేళ మునుగోడులో భారీగా మద్యం అమ్మకం సాగినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఒక్క మునుగోడులోనే రూ.300 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ నెలలో రూ.3037 కోట్ల మద్యం అమ్మకాలు జరగగా.. అందులో ఒక్క మునుగోడు నియోజకవర్గంలోనే రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరగడం విశేషం. దీన్ని బట్టి చూస్తే అర్ధం అవుతుంది మునుగోడులో ఏరేంజ్‌లో మద్యం ఏరులైపారిందో. ఒక నియోజకవర్గంలో ఇంత భారీ మొత్తంలో మద్యం అమ్మకాలు జరగడం ఇదే తొలిసారని అధికారులు అంటున్నారు.
BREAKING : ఆల్ టైం రికార్డులు బద్దలు… ఒక్క మునుగోడులోనే రూ.300 కోట్ల మద్యం అమ్మకాలు..
Advertisement
తాజా వార్తలు
Advertisement