Thursday, November 21, 2024

Breaking : సమంతకు అరుదైన వ్యాధి..ట్రీట్ మెంట్ తీసుకుంటున్న ఫొటోని షేర్ చేసిన నటి

నటి సమంతకు అరుదైన వ్యాధి సోకిందట. మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతుంది ఈ స్టార్ హీరోయిన్. యశోద చిత్రం విడుదల సందర్భంగా వ్యాధి గురించి వెల్లడించింది సమంత. రోగ నిరోధకశక్తిపై ప్రభావం చూపే అరుదైన వ్యాధి మయోసైటిస్. కాగా ప్రస్తుతం ఈ వ్యాధి తగ్గుముఖం పడుతుందని ట్వీట్ ద్వారా తెలిపింది సమంత. అయితే ఈ వ్యాధి తగ్గేందుకు ఊహించిన దానికంటే ఎక్కువ సమయం పడుతోందని తెలిపింది. ఈ మేరకు ట్రీట్ మెంట్ తీసుకుంటున్న ఫొటోని షేర్ చేసింది సమంత. దాంతో ఆమె ఫ్యాన్స్ సమంత త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement