న్యూజిలాండ్ తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో వికెట్ కూల్చాడు. భారత బౌలర్లకు తలనొప్పిగా మారుతున్న టామ్ బ్లండెల్ (38 బంతుల్లో 2)ను అవుట్ చేశాడు. అశ్విన్ వేసిన బంతిని టామ్ డిఫెండ్ చేశాడు. అయితే బ్యాట్‌కు తగిలిన ఆ బంతి పిచ్‌పై స్టెప్ తీసుకుని వికెట్ల పైనుంచి వెళ్లి కీపర్ భరత్ చేతుల్లో పడింది.
ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. వికెట్ల పైనుంచి వెళ్లే క్రమంలో ఆ బాల్ కాస్త బెయిల్స్‌ను ముద్దాడింది. దీంతో బెయిల్స్ కిందపడ్డాయి. అంతే భారత ఆటగాళ్లు సంబరాలు చేసుకోగా.. బ్లండెల్ నిరాశగా పెవిలియన్ చేరాడు. దీంతో కివీస్ జట్టు 138 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. విజయానికి ఆ జట్టు 146 పరుగుల దూరంలో ఉంది. అయితే భారత్ మాత్రం మరో మూడు వికెట్లు తీసుకుంటే మ్యాచ్ గెలుస్తుంది. కాగా, కడపటి వార్తలు అందేసరికి 147 పరుగులతో న్యూజిలాండ్ బ్యాటింగ్ కొనసాగిస్తోంది. రచిన్ రవీంద్ర, కైల్ జేమ్సన్ క్రీజ్‌లో ఉన్నారు. అయితే 86వ ఓవర్‌లో జడేజా వేసిన బాల్‌కు జెమీసన్ ఎల్‌బీడబ్ల్యూ అయ్యాడు. దీంతో న్యూజీలాండ్ 8వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం రవీంద్ర, సోథీ క్రీజ్లో ఉన్నారు. నిలకడగా ఆడి మ్యాచ్‌ని డ్రా చేసేందుకు కీవీస్ బ్యాట్స్‌మన్ ట్రై చేస్తున్నారు.