Friday, November 22, 2024

రూల్స్ బ్రేక్‌.. ఇద్ద‌రు పైలెట్ల లైసెన్సు ర‌ద్దు..

విమాన ప్ర‌యాణం అంటే ఎంతోమంది స‌ర‌దాప‌డ‌తారు. కానీ అందులో ప్ర‌యాణించేట‌పుడు ఎలాంటి సంకేతిక లోపం ఏర్ప‌డినా ప్రాణాలు గాల్లో క‌ల‌వ‌డం ఖాయం. అందుచేత‌నే ఎయిర్ లైన్స్ క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త‌, క‌ఠిన నిబంధ‌న‌ల న‌డుమ సిబ్బంది విధులు నిర్వ‌హించాల్సి ఉంటుంది. ఎలాంటి పొర‌పాటు చేసినా.. సంస్థ నిబంధ‌న‌లు అతిక్ర‌మించినా జాబ్ పోవ‌డం ఖాయం. అందుచేత‌నే పైలెట్లు అప్ర‌మ‌త్తంగా ఉండి విధులు నిర్వ‌ర్తిస్తారు. రూల్స్ బ్రేక్ చేసిన ఇద్ద‌రిని ఆయా విమానయాన సంస్థ‌లు లైసెన్స్ ర‌ద్దు చేసింది. రెండు వేర్వేరు కేసుల్లో ఇద్ద‌రు పైలెట్ల‌పై డీజీసీఏ చ‌ర్య‌లు తీసుకున్న‌ది. రూల్స్ అతిక్ర‌మించిన ఆ ఇద్ద‌రు పైలెట్ల లైసెన్సుల‌ను డీజీసీఏ తాత్కాలికంగా ర‌ద్దు చేసింది. స్పైస్ జెట్‌కు చెందిన ఓ క‌మాండ్ పైలెట్‌పై ఆరు నెల‌ల నిషేధం విధించారు. మేఘాల్లోకి వెళ్ల‌వ‌ద్దు అని కో పైలెట్ వార్నింగ్ ఇచ్చినా క‌మాండ్ పైలెట్ ప‌ట్టించుకోలేద‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. మే ఒక‌టో తేదీన ముంబై నుంచి దుర్గాపూర్ వెళ్తున్న విమానం తీవ్ర కుదుపుకు గురైంది. క‌మాండ్ పైలెట్ స‌రైన రీతిలో ఆ విమానాన్ని న‌డ‌ప‌లేక‌పోయారు. ఆ స‌మ‌యంలో విమానంలో సుమారు 195 మంది ప్యాసింజెర్లు ఉన్నారు. ఇక మ‌రో కేసులో ఓ చార్ట‌ర్ విమానానికి చెందిన పైలెట్ లైసెన్సును స‌స్పెండ్ చేశారు. నెల రోజుల పాటు లైసెన్సును నిలిపివేశారు. 2021 అక్టోబ‌ర్ 19న బొకారో నుంచి రాంచీ వెళ్తున్న విమానంలో ఇంధ‌నం లేద‌ని ఆ విమానాన్ని అత్య‌వ‌స‌రంగా దించారు. కానీ ఆ విమానంలో కావాల్సినంత ఇంధ‌నం ఉంద‌ని విచార‌ణ‌లో తేలింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement