Tuesday, November 19, 2024

మార్కెట్‌ లాభాలకు బ్రేక్‌.. నష్టాల్లో ముగిసిన సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరసగా 8 రోజుల లాభాలకు శుక్రవారం నాడు బ్రేక్‌ పడింది. ఉదయం నుంచే నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు రోజంతా అదే బాటులో నడిచాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు మార్కెట్లపై ప్రభావం చూపించాయి. 8 రోజుల పాటు వరస లాభాలు ఆర్జించిన మదుపర్లు లాభాల స్వీకరణకు దిగారు. కీలక రంగాలైన బ్యాంకింగ్‌, ఆటో వంటి వాటిలో విక్రయాలు భారీగా ఉండటంతో సూచీలు ఏ దశలోనూ కోలుకోలేదు.

సెన్సెక్స్‌ 415.69 పాయింట్ల నష్టంతో 62868.50 వద్ద ముగిసింది. నిఫ్టీ 116.40 పాయింట్ల నష్టంతో 18696.10 వద్ద ముగిసింది. బంగారం పది గ్రాముల ధర 48 రూపాయలు పెరిగి 53286 వద్ద ట్రేడయ్యింది. వెండి కిలో ధర 16 రూపాయలు పెరిగి 63921 వద్ద ట్రేడయ్యింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 81.41 రూపాయల వద్ద ముగిసింది.

లాభపడిన షేర్లు

- Advertisement -

టాటా స్టీల్‌, టెక్‌ మహీంద్రా, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, అపోలో ఆస్పటల్స్‌, బీ పీసీఎల్‌ షేర్లు లాభపడ్డాయి.

నష్టపోయిన షేర్లు

ఎం అండ్‌ ఎం, హిందూస్థాన్‌ యూనిలీవర్‌, నెస్లే ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ, ఏషియన్‌ పెయింట్స్‌, ఇన్ఫోసిస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, టీసీఎస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎల్‌ అండ్‌ టీ, టైటాన్‌ కంపెనీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఆల్ట్రాటెక్‌ సిమెంట్స్‌:, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌,
హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, విప్రో, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు నష్టపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement