నేను రాజ్‌భవన్‌లో పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయను. అనాధిగా వస్తున్న ఈ సంప్రదాయానికి బ్రేక్ చేస్తున్నాను. భగత్‌సింగ్ గ్రామమైన ఖట్కర్‌కలన్‌లోనే నేను పంజాబ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తాను. ఆప్ ప్రభుతం చేపట్టే ఏ ప్రభుత కార్యక్రమంలో సీఎం ఫొటోలు కనిపించవు. మాది మాటల ప్రభుతం కాదు.. చేతల ప్రభుత్వం అని నిరూపిస్తాం. అన్ని ప్రభుత కార్యాలయాల్లో.. షహీద్ భగత్ సింగ్, బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్రాలు మాత్రమే ఉంటాయి. సీఎంగా ఉంటూనే.. ఓ సామాన్య వ్యక్తిగా ప్రజలకు సేవ చేస్తాను.
భారీ మెజార్టీతో గెలుపు
భగవంత్ మాన్.. ఆప్ సీఎంగా అభ్యర్థిగా ఉన్నారు. ధురీ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసి.. భారీ మెజార్టీతో గెలుపొందారు. భగవంత్ మాన్‌కు.. 82,592 ఓట్లు పోలయ్యాయి. సమీప కాంగ్రెస్ అభ్యర్థి దల్వీర్ సింగ్ గోల్డిdకి 24,386 ఓట్లు పోలయ్యాయి. 58,206 ఓట్ల భారీ మెజార్టీతో భగవంత్ మాన్ గెలుపొందాడు. ప్రస్తుతం భగవంత్ మాన్.. సంగ్రూర్ లోక్‌సభ నియోజకవర్గానికి ఆప్ ఎంపీగా కూడా ఉన్నారు. ఇక మూడో స్థానంలో శిరోమణి అకాలీ దళ్ నేత ప్రకాష్ చంద్ గార్గ్ నిలిచాడు. ఈయనకు 6,959 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.
సంప్రదాయానికి బ్రేక్.. నేను అక్కడే ప్రమాణం చేస్తానన్న భగవంత్..
Advertisement
తాజా వార్తలు
Advertisement