కియా ఇండియా ప్రధాన వెబ్సైట్ నుంచి తొలగించింది. భారత్లో కియా కార్నివాల్ విక్రయాలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. కియా వెబ్సైట్ నుంచి ఎంపీవీ కార్నివాల్ను తొలగించడంతో ఈ సందేహాలు తలెత్తుతున్నాయి. దీనిపై కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. డీలర్లు వీటి బుకింగ్లు తీసుకోవడం ఆపేశారు. 2020లో కియా కార్నివాల్ భారత్లో విడుదలైంది. అప్పటి నుంచి దీంట్లో కంపెనీ ఎలాంటి అప్గ్రేడ్లను తీసుకురాలేదు.
ఇటీవల అమల్లోకి వచ్చిన బీఎస్6 రెండో దశ ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడమే కార్నివాల్ ఉపసంహరణకు కారణమని తెలుస్తోంది. మరోవైపు కియా ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో ఎంపీవీ సెగ్మెంట్లో కొత్త తరం కేఏ4ను విక్రయిస్తోంది. కార్నివాల్ను అప్గ్రేడ్ చేయడానికి బదులు కేఏ4ను భారత్కు తీసుకురానున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో త్వరలో కియా భారత్లో నాలుగో తరం ఫేస్లిప్ట్n వెర్షన్ ఎంపీవీని విడుదల చేయనుందని వాహన పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.