Thursday, November 21, 2024

ఢిల్లీలో తాగునీటి సరఫరాకు బ్రేక్.. ఎందుకో తెలుసా..

న్యూఢిల్లి, (ప్రభ న్యూస్‌): యమునా నదిలో అమోనియా ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో ఢిల్లిలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరా స్తంభించింది. వాజిరాబాద్‌ ప్రాంతంలోని యమునా నదిలో అమోనియా స్థాయి 3 పీపీఎం (పార్ట్‌ పర్‌ మిలియన్‌) ఉన్నట్టు అధికారులు తెలిపారు. హర్యానా నుంచి వెలువడిన పారిశ్రామిక వ్యర్థాలు యమునా నది నీటిలో ప్రవహిస్తున్నందున నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడిందని ఢిల్లి నీటి సరఫరా బోర్డ్‌ వైస్‌ చైర్మన్‌ రాఘవ్‌ చడ్డా తెలిపారు. దేశ రాజధానిలో తూర్పు, ఈశాన్య, దక్షిణ ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉందని ఆయన వెల్లడించారు. పెరిగిన నీటి కాలుష్యాన్ని నియంత్రిం చడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు.

నీటిని పొదుపుగా వాడుకోవాలని రాఘవ్‌ చడ్డా సూచించారు. తగిన సంఖ్యలో నీటి ట్యాంకర్లను అందుబాటులోకి ఉంచామన్నారు. యమునా నది నీటిలో అమోనియా స్థాయి పెరగడంతో నీటి సరఫరాపై ప్రభావం పడిందన్నారు. దసరా-దీపావళి సమయంలో గంగా కాలువను ప్రతీ ఏడాది నిర్వహించే మెయింటెనెన్స్‌ కారణంగా మూసి ఉంచారు. దీంతో యుమనా నది నుంచి సోనియా విహార్‌, భాగీరథి వాట్‌ ట్రీట్‌ మెంట్‌ ప్లాంట్లకు నీటి సరఫరా 50 శాతం తగ్గిపోయింది. వజీరాబాద్‌ ప్లాంట్‌లో నీటి తయారీ రోజుకు 134 మిలియన్‌ గ్యాలన్లు ఉండగా.. 129.37 మిలియన్‌ గ్యాలన్లకు తగ్గించబడింది.

అదేవిధంగా చంద్రవాల్‌లో 94 మిలియన్‌ గ్యాలన్లు తయారు చేయాల్సి ఉండగా.. 83.09 మి.గ్యాలన్లకు, భాగీరథి 110 మి.గ్యాలన్ల కెపాసిటీ ఉండగా.. 49.78 మి.గ్యాలన్లకు పడిపోయింది. సోనియా విమార్‌ ప్లాంట్‌ 140 మి.గ్యాలన్ల నీటి ఉత్పత్తి ఉండగా.. 51.23 మి. గ్యాలన్లకు పడిపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement