Tuesday, November 26, 2024

Break: ద‌ళిత‌బంధుకు బ్రేక్‌…నిలిపివేసిన ఎస్సీ సంక్షేమ శాఖ

తెలంగాణలో దళితబంధును ఎస్సీ సంక్షేమ శాఖ నిలిపివేసింది. దళిత బంధు పథకంపై మునుపటి ప్రభుత్వం రూ. 4,441.8 కోట్లు ఖర్చు చేసింది. ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షలు మంజూరు చేసింది. తొలి విడతలో ఎంపికైన వారందరికీ నిధులు అందాయి.

రెండో విడతగా నియోజకవర్గానికి 1,100 మంది చొప్పున సుమారు రూ.1.30 లక్షల కుటుంబాలకు పథకాన్ని అమలు చేయాలని గత ప్రభుత్వం లక్ష్యం విధించుకుంది. రెండో విడత కార్యక్రమంలో పైలట్ ప్రాజెక్టు కింద 400 మందిని ఎంపిక చేసి యూనిట్లు మంజూరు చేశారు. నిధుల విడుదలపై విధానపరమైన స్పష్టత వచ్చే వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని నిర్ణయించిన ఎస్సీ సంక్షేమ శాఖ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇప్పటికే దళిబంధు యూనిట్లు మంజూరై కొంత మొత్తం నగదు విడుదలైన వారికి మిగతా నిధులు విడుదల చేయాలా? వద్దా? అనే అంశంపైనా స్పష్టత కోరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement