రష్యా బలగాలు చేసిన క్షిపణి దాడిలో బ్రెజిల్ మాజీ మోడల్, స్నైపర్. థాలిట డో వల్లె (39) ప్రాణాలు కోల్పోయింది. భీకర యుద్దం జరుగుతున్న ఉక్రెయిన్‌లో ఉన్న ఆమె.. ఆ దేశం తరపున స్నైపర్‌గా బరిలోకి దిగి రష్యా సేనలను అడ్డుకునే క్రమంలో ప్రాణాలు కోల్పోయింది. ఖార్కివ్ నగరంపై రష్యా సైన్యం జూన్ 30న క్షిపణులతో విరుచుకుపడింది. తొలిసారి క్షిపణి దాడి జరిగినప్పుడు తన ట్రూప్‌లో ఈ మోడల్ మాత్రమే ప్రాణాలతో మిగిలింది. కానీ ఆ తర్వాత మరో క్షిపణా ఉన్న ఫళంగా పడటంతో ఆమె మృత్యువాత పడింది. బంకర్‌లో ఉన్న మోడల్ థాలిట కోసం బ్రెజిల్ మాజీ సైనికుడు డాగ్లస్ బురిగో (40) కూడ క్షిపణి దాడిలో మరణించాడు. థాలిటకు గతంలో యుద్దంలో పాల్గొన్న అనుభవం ఉంది. ఇరాక్‌లో ఇస్లామిక్ స్టేట్‌కు వ్యతిరేకంగా ఆమె పోరాడింది. ఇందుకు సంబంధించిన డాక్యుమెంటరీని తన యూట్యూబ్ చానల్లో పోస్టు చేసింది. ఇరాక్‌లో పెష్ మోర్గాస్ సాయుధ బలగాల తరపున పోరాడే సమయంలోనే స్నైపర్ శిక్షణ తీసుకుంది. ఆమె అనుభవాలను పుస్తక రూపంలో తీసుకొచ్చేందుకు ఓ రచయిత బ్రెజిల్ సైనికుడితో కలిసి పని చేస్తున్నాడు.
మానవతావాది.. థాలటీ యుక్త వయస్సులో నటిగా, మోడల్‌గా పని చేసింది. లా చదివే సమయంలో ఆమె ఎన్‌జీఓలతో కలిసి జంతువులను కాపాడే కార్యక్రమాల్లో పాల్గొంది. ఆమె సోదరుడు రొడ్రిగో వైరా.. ఆమె ఓ హీరో అని చెప్పాడు. ఎంతో మంది ప్రాణాలు కాపాడేందుకు, మానవతా కార్యక్రమాల్లో పాలు పంచుకునేందుకు ఆమె దేశాలు సంచరిస్తుందని పేర్కొన్నాడు. ఆమె ఉక్రెయిన్‌కు వెళ్లి మూడు వారాలే అవుతోందని చెప్పాడు. అక్కడ సహాయక కార్యక్రమాల్లోనే పాల్గొంటూనే షార్ప్ షూటర్‌గా సేవలందిస్తోందని తెలిపాడు. ఆఖరిసారి ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా బలగాలు బాంబు దాడులు జరిపినప్పుడు థాలిట తృటిలో ప్రాణాలతో బయటపడింది. ఆ తర్వాత ఇంటికి ఫోన్ చేసి తాను క్షేమంగానే ఉన్నానని తెలియజేసింది. రష్యా బలగాలు డ్రోన్ల ద్వారా తన ఫోన్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నందుకు ఎక్కువ మాట్లాడలేనని కుటుంబ సభ్యులకు వివరించింది. ఆ తర్వాత ఆమె గత సోమవారమే ఖార్గివ్‌కు వెళ్లింది. అప్పుడే చివరిసారిగా కుటుంబంతో మాట్లాడింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.