సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో మధ్యంతర బెయిల్ లభించినప్పటికీ, హీరో అల్లు అర్జున్ ఈ రాత్రికి చంచల్ గూడ జైలులో ఉండనున్నారు. అల్లు అర్జున్ రేపు ఉదయం 6 గంటల తర్వాత ఎప్పుడైనా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.
కాగా, అల్లు అర్జున్ బెయిల్ కాపీని హైకోర్టు అధికారికంగా అప్లోడ్ చేసింది. బెయిల్ కాపీని పరిశీలించిన చంచల్ గూడ జైలు సూపరింటెండెంట్ రేపు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ధృవీకరించారు.