న్యూఢిల్లి : దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన దీర్ఘశ్రేణి బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్షిపణి ప్రయోగం మరోసారి విజయవంతమైంది. అయితే ఈసారి ప్రయోగానికి కొంత ప్రాధాన్యత ఉంది. సముద్రంలో మోహరించిన పాడుబడిన ఓ నౌకను లక్ష్యంగా చేసి అటు గగనతలం నుంచి ఇటు యుద్ధనౌంకనుంచి రెండు క్షిపణులను ప్రయోగించడం, అవి నిప్పులుకక్కుతూ నేరుగూ దూసుకుపోయి లక్ష్యాన్ని తుత్తునియలు చేశాయి. గంటకు 3వేల కి.మి. వేగంతో నిర్ణీత సమయంలో, అత్యంత కచ్చితత్వంతో ఛేదించాయని, ఫలితంగా ధ్వంసమైన లక్ష్యం సముద్రంలో మునిగిపోయిందని రక్షణశాఖ ప్రకటించింది.
తూర్పుతీరంలో మోహరించిన భారత నౌకదళానికి చెందిన ఐఎన్‌ఎస్ ఢిల్లి నుంచి నౌకాదళం ఒక క్షిపణిని ప్రయోగించింది. అది లక్ష్యాన్ని ఛేదించిన వెంటనే గగనతలం నుంచి వాయుసేనకు చెందిన సుఖోయ్ 30 ఎమ్‌కేఐ యుద్ధవిమానం నుంచి మరో క్షిపణిని ప్రయోగించారు. అది కూడ గురి తప్పకుండా లక్ష్యాన్ని ఛేదించింది. ఐఎన్‌ఎస్ ఢిల్లి యుద్ధనౌకనుంచి బ్మ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం ఇదే తొలిసారి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..