Tuesday, November 26, 2024

బ్రహ్మోస్‌ పరీక్ష సక్సెస్‌.. యాంటీ షిప్‌ మిసైల్‌ ప్రయోగం

బ్రహ్మోస్‌ యాంటీ షిప్‌ మిసైల్‌ ప్రయోగం విజయవంతమైంది. ఈ విషయాన్ని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సముద్రంలో ఉన్న ఓడలు, పడవలు వంటి లక్ష్యాలను ఛేదించేందుకు ప్రత్యేకంగా తయారు చేసిన యాంటీషిప్‌ వెర్షన్‌ బ్రహ్మోస్‌ సూపర్‌ సోనిక్‌ క్షిపణి పరీక్ష విజయవంతమైనట్టు ఇండియన్‌ నేవీ, అండమాన్‌ నికోబార్‌ కమాండ్‌ వెల్లడించాయి. బ్రహ్మోస్‌ క్షిపణి అత్యంత కచ్చితతంతో నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించినట్టు తెలిపాయి.

ఈ ప్రయోగాన్ని ఇండియన్‌నేవీ, అండమాన్‌ నికోబార్‌ కమాండ్‌ సంయుక్తంగా నిర్వహించాయి. ఈనెల 19న భారత వైమానిక దళం సుఖోయ్‌ యుద్ధ విమానం నుంచి బ్రహ్మోస్‌ క్షిపణిని పరీక్షించింది. అంతకుముందు హిందూ మహా సముద్రం నుంచి బ్రహ్మోస్‌ క్షిపణిని పరీక్షించారు. బ్రహ్మోస్‌ క్షిపణి ధని వేగం కంటే మూడు రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించి లక్ష్యాలను ఛేదించగలదు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement