నేడు హాస్య బ్రహ్మ బ్రహ్మానందం పుట్టినరోజు.. ఇప్పుడంటే సినిమాల వేగాన్ని తగ్గించాడు కానీ, అప్పట్లో ఆయన లేని సినిమా లేదు. అంతేనా.. వెయ్యికి పైగా సినిమాల్లో నటించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో తన పేరు లిఖించుకున్నాడు. ఇప్పటి తరానికి బ్రహ్మానందం మీమ్స్ దేవుడు, ట్రోల్స్ రారాజు. ఆయన లేకుండా ఒక్క మీమ్ కూడా ఉండదు. నిజానికి ఆయన లేకపోతే టాలీవుడ్‌లో మీమ్సే లేవు. సినిమాలు తగ్గించినా.. ఆ లోటు మీమ్స్ తీరుస్తుంది. సోషల్ మీడియాలో బ్రహ్మానందంని చూడని రోజంటూ ఉండదు. ఏ జిఫ్ ఫైల్ చూసినా కూడా బ్రహ్మానందం కనిపిస్తాడు. ఏ మీమ్ చూసినా, ఏ ట్రోల్ వీడియోలో చూసినా బ్రహ్మానందమే కనిపిస్తాడు. అలా బ్రహ్మానందాన్ని చూస్తేనే మహదానందంగా అనిపిస్తుంటుంది.
అలా ఇప్పుడు బ్రహ్మనందం జిఫ్ గాడ్‌గా మారిపోయాడు. చాలా కాలం తర్వాత బ్రహ్మీ ‘రంగమార్తాండ’తో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. కృష్ణ వంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. దీనితో పాటుగా తరుణ్ భాస్కర్ తెరకెక్కిస్తున్న ‘కీడా కోలా’ మూవీలోనూ బ్రహ్మీ ఓ కీలకపాత్ర పోషిస్తున్నాడు. కాగా తాజాగా ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది. బ్రహ్మ బర్త్‌డే సందర్భంగా రిలీజైన పోస్టర్‌కు ప్రేక్షకుల నుండి అనూహ్య స్పందన వస్తుంది. ఈ సినిమాలో బ్రహ్మీ వరద రాజు పాత్రలో నటిస్తున్నాడు. పేరు వరద.. పోసేది పితుకంత అంటూ క్యాప్షన్‌ను కూడా జత చేశారు.. దీన్ని బట్టి చూస్తే బ్రహ్మనందంను తరుణ్ ఏ రేంజ్‌లో వాడుకున్నాడో అర్ధమవుతుంది. ఇక పాత బ్రహ్మీని ఈ సినిమాలో చూస్తాము అంటూ తరుణ్ ఓ స్టేట్‌మెంట్‌ను కూడా ఇచ్చాడు. బ్రహ్మానందానికి బర్త్ డే విషెష్ ని చెబుతున్నారు పలువురు సెలబ్రిటీలు.