తన నెంబర్ బ్లాక్ చేసిందని మాజీ ప్రియురాలి ముందు గన్ తో గాల్లోకి కాల్పులు జరిపాడు ప్రియుడు. రిటైర్డ్ ఆర్మీ అధికారి కుమారుడు అయిన సురేష్ వృత్తిరీత్యా వ్యాపారం చేస్తున్నాడు. ఇతను ఓ యువతిని ప్రేమించాడు. అయితే గత కొన్ని రోజులుగా యువతి సురేష్ ను దూరం పెట్టడంతో పాటు నెంబర్ ని కూడా బ్లాక్ చేసింది. దీంతో యువతిని కలుద్దామని ఇంటికి బయలుదేరాడు. ఆ సమయంలో లో సదరు యువతి మరో స్నేహితుడు ఇంటికి వెళ్ళిందని తెలిసి ఆగ్రహంతో అక్కడికి వెళ్లాడు.
ఆమెను బెదిరించేందుకు గాల్లో కాల్పులు జరిపాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సురేష్ తో పాటు అతనికి రివాల్వర్ ఇచ్చిన స్నేహితుడి ని కూడా అరెస్టు చేశారు. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది.