Wednesday, November 20, 2024

న‌డిరోడ్డుపై ప్రియురాలిని చిత‌క‌బాదిన ప్రియుడు.. స్పృహ కోల్పోయిన ప్రియురాలు

త‌న ప్రియురాలిని న‌డిరోడ్డుపై చిత‌క‌బాదాడు ఓ యువ‌కుడు..ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో చోటు చేసుకుంది. ఓ దుర్మార్గుడు ప్రియురాలిపై అత్యంత కిరాతకంగా దాడికి పాల్పడ్డాడు. ప్రియురాలు పెళ్లి చేసుకోవాలని కోరేసరికి ఉన్మాదిలా మారాడు. నడిరోడ్డుపై యువతిని నేలపై పడేసి అత్యంత క్రూరంగా చితకబాదుతూ, కాలితో తంతూ అమానవీయంగా వ్యవహరించాడు. ప్రియుడి దాడితో యువతి స్పృహ కోల్పోయి రోడ్డుపై పడిపోగా కొందరు ఆమెను కాపాడేప్రయత్నం చేసారు. ఇలా యువతిని ప్రియుడు కొడుతుండగా వీడియో తీసినవారు సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారి పోలీసులకు చేరడంతో సదరు దుర్మార్గున్ని అరెస్ట్ చేసారు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement