Monday, November 25, 2024

బాయ్‌కాట్ హ్యుందాయ్‌.. కాశ్మీర్‌పై వివాదాస్పద పోస్టు..

దేశ వ్యాప్తంగా హ్యుందాయ్‌ కంపెనీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది. హ్యందాయ్‌ పాకిస్తాన్‌ సోషల్‌ మీడియాలో ఖాతాలో ఆ కంపెనీ చేసిన పోస్టే దీనికి కారణం.. కాశ్మీర్‌ కోసం ప్రాణాలు అర్పించిన వారిని స్మరించుకుందాం.. స్వాతంత్య్రం కోసం వారు చేస్తున్న పోరాటానికి అండగా నిలుద్దాం అంటూ పోస్టు చేసింది. ఫిబ్రవరి 5న నిర్వహించే కాశ్మీర్‌ సంస్మరణ దినోత్సవం సందర్భంగా పాకిస్తాన్‌ హ్యుందాయ్‌ ఈ ప్రకటన చేసింది. దీంతో భారతీయులందరూ హ్యుందాయ్‌పౖౖె యుద్ధాన్ని ప్రకటించారు. పాక్‌కు అనుకూలంగా హ్యుందాయ్‌ వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు.

బాయ్‌ కాట్‌ హ్యుందాయ్‌ హ్యాష్‌ ట్యాగ్‌ ట్రెండ్‌ ప్రారంభించారు. దీనిపై మోటార్‌ ఇండియా హ్యుందాయ్‌ స్పందిస్తూ.. 25 ఏళ్లుగా భారత్‌లో కార్యకలాపాలను సాగిస్తున్నామని, జాతీయవాదానికి తాము ఎప్పుడూ కట్టుబడి ఉన్నామని తెలిపింది. ఈ సున్నితమైన అంశాన్ని కఠినంగా వ్యవహరిస్తామని, గట్టి చర్యలు తీసుకుంటామని తెలిపింది. హ్యుందాయ్‌కు భారత్‌ రెండో ఇల్లుగా అభివర్ణించింది. కొన్ని హిందూవాద సంస్థలు కూడా హ్యుందాయ్‌ కంపెనీపై దుమ్మెత్తి పోస్తున్నారు. భారతీయులందరికీ.. బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే అంటూ డిమాండ్‌ చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement