Tuesday, November 26, 2024

Boycott | కర్నాటకలో మరో వివాదం.. వీహెచ్​పీ ఆధ్వర్యంలో వెలిసిన ‘బాయ్​కాట్’​ బ్యానర్!​

కర్నాటక రాష్ట్రంలోని మంగళూరులో మరో వివాదం చెలరేగింది. మంగళూరు సమీపంలోని కావూరులో జరిగే ఓ ఉత్సవంలోవిశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ), బజరంగ్ దళ్ సభ్యులు ఈ వివాదానికి కారణమయ్యారు. ఈ ఉత్సవంలో ముస్లిం వ్యాపారులకు వ్యతిరేకంగా ‘బహిష్కరణ బ్యానర్’ను ఏర్పాటు చేశారు. ధార్మిక ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలోని మహాలింగేశ్వర ఆలయ ప్రాంగణంలో ఈ బ్యానర్‌ను ఏర్పాటు చేయడం ఆందోళనకు కారణమయ్యింది. ఇక్కడ జనవరి 14 నుండి 18వ తేదీ వరకు ప్రత్యేక ఉత్సవం జరుగుతుంది.

ఇంతకుముందు ఈ ఉత్సవంలో ఎక్కువగా ముస్లింలు స్టాల్స్ పెట్టేవారు. ఈసారి స్టాల్స్‌ని కాంట్రాక్టర్లకు కేటాయించారు. దీంతో అవి బజరంగ్‌ దళ్‌ కార్యకర్తలు దక్కాయని స్థానికులు తెలిపారు. ఆలయ నిర్వహణ కమిటీ సమావేశంలో ముస్లింల వ్యాపారాలపై బహిష్కరణ నిర్ణయం తీసుకున్నట్లు బజరంగ్ దళ్ కార్యకర్తలు తెలిపారు. హిందూ మతం, సంప్రదాయాలపై విశ్వాసం ఉన్న హిందూ వ్యాపారులకు మాత్రమే ఇక్కడ షాప్​లు నిర్వహించడానికి అవకాశం ఇస్తామని ఆ బ్యానర్​లో రాయడం ఆందోళనకు దారితీసింది.  కాగా, ఈ నియోజకవర్గానికి బీజేపీ ఎమ్మెల్యే భరత్ శెట్టి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇక్కడ ఆందోళనలు జరగకుండా ఆలయ ప్రాంగణం.. పరిసర ప్రాంతాలలో పోలీస్ డిపార్ట్ మెంట్, సిటీ ఆర్మ్ డ్ రిజర్వ్ (CAR) కి చెందిన ఫోర్స్ , ప్లాటూన్‌లను మోహరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement