వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో భారత బాక్సర్లు ఆకాశ్ సంగ్వాన్ (67కేజీలు), నిషాంత్ దేవ్ (71కేజీలు) సత్తా చాటారు. శనివారంనాడిక్కడ జరిగిన పోటీలో ఆకాశ్ తన ప్రత్యర్థి చైనీస్ బాక్సర్ ఫు మింగ్కేపై, నిషాంత్ తన ప్రత్యర్థి కొరియన్ సంగ్మిన్ లీపై 5-0తేడాతో విజయం సాధించారు.
తద్వారా ఇరువురూ సునాయాసంగా ప్రి-క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. తదుపరి మ్యాచ్‌లో ఆకాశ్ ఐదవ సీడెడ్ దులత్ బెక్బవువ్ (కజఖస్తాన్)తోను, నిషాంత్ తన తదుపరి మ్యాచ్‌లో పాలస్తీనియన్ ఫొఖహ నిదల్తో తలపడనున్నాడు.