Friday, September 20, 2024

Boxing – తిరుగులేని లొవ్లీనా పంచ్

పారిస్ ఒలింపిక్స్‌లో భార‌త బాక్స‌ర్ లొవ్లీనా బొర్గెహైన్ ప‌త‌క వేట‌లో ముందంజ వేసింది. త‌న పంచ్ ప‌వ‌ర్‌కు తిరుగులేద‌ని చాటుతూ క్వార్ట‌ర్స్‌కు దూసుకెళ్లింది. బుధ‌వారం జ‌రిగిన 75 కిలోల‌ విభాగం బౌట్‌లో లొవ్లొనా చెల‌రేగింది. ఏక‌ప‌క్ష పోరులో నార్వేకు చెందిన సున్నివా హొఫ్‌స్తాద్ ను చిత్తుగా ఓడించింది. విశ్వ క్రీడ‌ల్లో ఫేవ‌రెట్‌గా బ‌రిలోకి దిగిన లొవ్లీనా తొలి రౌండ్ నుంచి ప్ర‌త్య‌ర్థిపై విరుచుకుప‌డింది. ఆమె ధాటికి సున్నివా బిత్త‌ర‌పోయింది. దాంతో, 5 పాయింట్లు సాధించిన‌ లొవ్లినాను అంపైర్లు విజేత‌గా ప్ర‌క‌టించారు. తద్వారా ఈ ఈశాన్య బాక్స‌ర్ ప‌త‌కానికి ఒక్క అడుగు దూరంలో నిలిచింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement