Saturday, July 6, 2024

Kalki | బాక్సాఫీస్ ప్రాభాస్ ఊచకోత… 700 కోట్లతో దూసుకుపోతున్న “కల్కి”

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన మైథలాజిక‌ల్ సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 AD. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు 700 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇదే విషయాన్ని మేకర్స్ తాజా పోస్టర్ ద్వారా వెల్లడించారు.

ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు దీపికా పదుకొణె, దిశా పటానీ కథానాయికలుగా నటించగా, యూనివర్సల్ స్టార్ క‌మల్ హాసన్, బిగ్ బి అమితాబ్ బచ్చన్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, శోభన, మాళవిక నాయర్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక‌ ఈ భారీ బడ్జెట్ చిత్రానికి సంతోష్ నారాయణన్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. లాంగ్ రన్ లో ఈ సినిమా మరింత వసూళ్లు రాబట్టే అవకాశం ఉండ‌ని సినీ విశ్లేష‌కులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement