Friday, November 22, 2024

బౌలర్ల హవా, ఆసక్తికరంగా శ్రీలంక-ఆస్ట్రేలియా తొలి టెస్ట్‌.. తొలిరోజు 13 వికెట్లు డౌన్‌

శ్రీలంక-ఆస్ట్రేలియా మధ్య బుధవారం ప్రారంభమైన తొలి టెస్ట్‌ మ్యాచ్‌ తొలి రోజు ఆటలో ఇరు జట్ల బౌలర్లు సత్తా చాటారు. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక కేవలం 212 పరుగులకే ఆలౌట్‌ కాగా ఆస్ట్రేలియా ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా క్రీడాకారుడు 47 పరుగులతోను, ట్రావిస్‌ హెడ్‌ ఆరు పరుగులతోను క్రీజ్‌లో ఉండగా 114 పరుగులు వెనకబడి ఉంది. శ్రీలంక బౌలర్ల ధాటికి ఆస్ట్రేలియా డేవిడ్‌ వార్నర్‌, మార్నుస్‌ సబుస్‌చాగ్నే, స్టీవ్‌ స్మిత్‌ త్వరత్వరగా ఔటయ్యారు.

ఇరుజట్ల మధ్య గాలేలో జరుగుతున్న తొలి టెస్టులో టాస్‌ నెగ్గిన శ్రీలంక బ్యాటింగ్‌ను ఎంచుకుంది. ఆట ప్రారంభమైన వెంటనే ఆస్ట్రేలియా బౌలర్లు విజృంభించారు. ఆస్ట్రేలియా బౌలర్‌ నాథన్‌ లియాన్‌ మరోసారి ఐదు వికెట్లు పడగొట్టి ఔరా అన్పించాడు. ఇప్పటివరకు నాధన్‌ 20 సార్లు ఐదువికెట్ల చొప్పున పడగొట్టి తన సత్తా చాటాడు.మరోవైపు లెక్‌స్పిన్నర్‌ మిషెల్‌ స్వెప్సన్‌ మూడు పడగొట్టి శ్రీలంకను దెబ్బతీశాడు. ఆస్ట్రేలియా బౌలింగ్‌ను ధాటీగా ఎదుర్కొన్న నిరోషన్‌ డిక్‌ వెల్లా 42బంతుల్లో 5 ఫోర్లతో అర్ధ శతకం పూర్తి చేశాడు.

మాథ్యూస్‌ను నాథన్‌ లియాన్‌ ఔట్‌ చేయగా ఆ తరువాత నిరోషన్‌, రమేష్‌ మెండిస్‌ జోడీ 50 పరుగుల భాగస్వామ్యంతో స్కోరును పెంచే ప్రయత్నం చేశారు. తొలి సెషన్‌లో పేసర్లు విజృంభించగా రెండో సెషన్‌లో స్నిన్నర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. రెండో సెషన్‌ పూర్తయ్యేసరికి శ్రీలంక 6 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది. నిశాంక్‌ను పాట్‌ కమిన్స్‌ ఔట్‌ చేయగా, కుశాల్‌ మెండిస్‌ వికెట్‌ను మిషెల్‌ పడగొట్టాడు. ఆ తరువాత దిముత్‌ కరుణరత్నేను నాథన్‌ ఔట్‌ చేశయగా ధనంజయ డి సిల్వా, దినేష్‌ చండిమాల్‌లను మిషెల్‌ ఇంటికి పంపాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement