హైదరాబాద్, ఆంధ్రప్రభ : బొటానికల్ గార్డెన్‌ను దేశ, విదేశాల నుంచి వచ్చే సందర్శకులను ఆకర్శించే విధంగా తీర్చిదిద్దాలని సంబంధిత అధికారులను టీఎస్‌ఎఫ్‌డీసీ ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆదేశించారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ వే-ఫార్వర్డ్ అనే ఒక రోజు వర్క్ షాప్ కార్యక్రమాన్ని హైదరాబాద్ బొటానికల్ గార్డెన్‌లో శనివారం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి హాజరై మాట్లాడారు.
ప్రతీ సంవత్సరం నాటు-తున్నటు-వంటి లక్షలాది మొక్కలు నూటికి నూరు శాతం బ్రతికి ఉండేలా చర్యలు తీసుకొని తద్వారా సంస్థ ఆదాయం పెంచేందుకు దోహదపడాలని అధికారులను, ఫీల్డ్ సిబ్బందిని సూచించారు. అధిక దిగుబడి ఇచ్చే మొక్కలను నాటి కార్పొరేషన్ ఆదాయాన్ని పెంచాలని కోరారు.
ఈసందర్భంగా ప్లాంటేషన్ మేనేజర్లకు ల్యాప్ టాప్‌లను ఆయన అందజేశారు. డివిజన్‌ల వారీగా చేపట్టిన అభివృద్ధి పనులను, కార్యాచరణను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయనకు అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్, ఎండీ డా.జి.చంద్రశేఖర్ రెడ్డి, డైరెక్టర్ ఎంజె.అక్బర్, జీఎం.రవీందర్ రెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్లోన్నారు.